

ఆఫ్రికా దేశమైన కాంగో లో అరుదైన ఎబోలా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. పరిస్థితి విషమిస్తుండటంతో పొరుగు దేశమైన ఉగాండా కాంగోతో ఉన్న సరిహద్దును తక్షణమే మూసివేసింది. కాంగో నుంచి సరిహద్దు దాటి వచ్చిన వారివల్ల స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకినట్లు గుర్తించడంతో ఉపాధ్యక్షురాలు జెస్కా అలుపో నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకుంది. తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య వెయ్యికి చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
కాంగో ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు 101 ఎబోలా కేసులు నిర్ధారణ కాగా, దాదాపు 220 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 3,000 మందిపై నిఘా కొనసాగుతోంది. ఉగాండాలో ఇప్పటికే ఏడు ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో భారత్‌లో అప్రమత్తత పెంచారు. కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్త సహా నలుగురిని గుజరాత్లో ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళకు ఎబోలా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!