

అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళం రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతులను అంజన, అన్ మాథ్యూ గా గుర్తించారు. అంజన బంధువు వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరు త్రిశ్శూరు, తిరువనంతపురం, కొట్టాయం ప్రాంతాలకు చెందినవారు. అంజన, అన్ మాథ్యూ, అనిలా ముగ్గురూ స్నేహితులు. కుటుంబాలతో కలిసి కాలిఫోర్నియాలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. అంజన, అన్ మాథ్యూలను అనిలానే కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అనిలా పోలీసుల అదుపులో ఉన్నట్లు వినోద్ వెల్లడించారు.
ఈ ఘటనపై కేంద్రమంత్రి సురేశ్ గోపి స్పందించారు. ఇద్దరి మరణాలు హత్యలేనని నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే ఈ దారుణ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాలను వారి స్వరాష్ట్రం కేరళానికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ కష్ట సమయంలో వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హత్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!