

కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో ఇరాన్‌తో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ, పెజెష్కియాన్ మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి అంశం చర్చకు వచ్చి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఇరువురు నేతల భేటీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ సమావేశమయ్యారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉన్న దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా పెజెష్కియాన్ ఎస్‌సీవో సదస్సులో పాల్గొంటున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!