

నటి సమంత, రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులు కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్న సమంత.. తన ప్రెగ్నెన్సీ సమయంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టేందుకు అభిమానుల సలహాలు కోరారు. దీంతో పలువురు నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను సూచించారు. ఇందులో ఓ అభిమాని చేసిన సూచనకు సమంత ఇచ్చిన సరదా సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.
సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా పాప పుడితే ‘సమైరా’, బాబు పుడితే ‘సామ్రాజ్’ అని పేరు పెట్టాలని ఓ అభిమాని సూచించాడు. దీనిపై సమంత ఫన్నీగా స్పందిస్తూ.. “మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?” అంటూ నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. దీంతో ఆమె రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది జూన్‌లో తన ప్రెగ్నెన్సీ గురించి సమంత ప్రకటించారు. సినిమాలకు కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఈ ప్రత్యేక దశను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నానని ఆమె గతంలో వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!