

దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియా పోస్ట్ శుభవార్త అందించింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి జూలై 2026 షెడ్యూల్-II నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారిక పోర్టల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 19న ముగియనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 2 నుంచి 21 వరకు కొనసాగుతుంది.
ఈ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై పరిజ్ఞానం, కంప్యూటర్ అవగాహన అవసరం. వయోపరిమితి, రిజర్వేషన్ కేటగిరీలకు వర్తించే సడలింపులు తదితర నిబంధనలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక జీడీఎస్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!