

శ్రీనగర్‌లోని అధిక భద్రతా కేంద్రీయ జైలు నుంచి పోక్సో చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న ఇద్దరు అండర్‌ట్రయల్ నిందితులు తప్పించుకోవడం కలకలం రేపింది. వేర్వేరు పోక్సో కేసుల్లో జైలులో ఉన్న ఈ ఇద్దరు నిందితులు భద్రతా సిబ్బందిని తప్పించుకుని జైలు ప్రాంగణం నుంచి పరారైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసి, నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.
పరారైన వారిని అనంత్‌నాగ్‌కు చెందిన ముఖ్తార్ అహ్మద్ గుజ్జర్, రఫీఆబాద్‌కు చెందిన ఫర్మాన్ ఖాన్‌గా గుర్తించారు. వారి ఆచూకీకి సంబంధించి నమ్మదగిన సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు. వారిని పట్టుకునేందుకు దోహదపడే సమాచారాన్ని అందించిన వారికి తగిన బహుమతి ఇస్తామని తెలిపారు. సమాచారం ఉన్నవారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని లేదా అత్యవసర హెల్ప్‌లైన్ 112కు కాల్ చేయాలని సూచించారు. జైలు భద్రతా లోపంపై అంతర్గత విచారణ కూడా ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!