

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గంలో ఎదురైన ఓటమిని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్ ప్రక్రియలకు సంబంధించి లోపాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను రీకౌంట్ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
కొళత్తూర్‌లో తనపై విజయం సాధించిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తనను నియోజకవర్గ విజేతగా ప్రకటించాలని కోరారు. కొళత్తూర్ స్టాలిన్‌కు బలమైన నియోజకవర్గంగా కొనసాగుతూ వచ్చింది. గతంలో ఆయన ఇక్కడ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే 2026 ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీవీకే అభ్యర్థి, సీనియర్ నేత వీఎస్ బాబు 8,795 ఓట్ల తేడాతో స్టాలిన్‌పై విజయం సాధించారు. బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు లభించాయి. స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో జరిగే తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!