

తమిళనాడు రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. కారులో నుంచి బయటకు వస్తున్న మహిళను టీవీకే ప్రభుత్వంలోని పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి, శివకాశి ఎమ్మెల్యే ఎస్. కీర్తనగా కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కీర్తన.. వీడియోలో ఉన్న మహిళ తాను కాదని స్పష్టం చేశారు. మహిళల దుస్తులు, రూపురేఖలు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజకీయ చర్చగా మార్చడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సరైన అంశాలు లేనప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని కీర్తన ఆరోపించారు. వీడియోలో ఉన్న మహిళను అనవసరంగా వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్‌బీ రాజా కూడా మహిళల వ్యక్తిగత ఎంపికలపై సోషల్ మీడియాలో వేధింపులను ఖండించారు. ఈ ఘటనతో మహిళల గౌరవం, గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!