
సినిమాలు

తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్తగా అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 రకాల కొత్త లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది.
ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త బ్రాండ్ల ప్రవేశంపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే సెప్టెంబర్ 1లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!