
సినిమాలు

మిలాద్-ఉన్-నబీ పండగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 25 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 26 ఉదయం 4 గంటల వరకు ‘జల్సా’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన ప్రాంతాల్లో రూట్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!