
జనరల్

వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ముఖ్యంగా లా గువైరా ప్రాంతం తీవ్రంగా ప్రభావితమై, బాధితులు ఆహారం, తాగునీరు, అత్యవసర సహాయం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆకలి కేకలతో విలవిలలాడుతున్న పరిస్థితి నెలకొంది.
జూన్ 24న సంభవించిన ఈ విపత్తులో కాటియా లా మార్లోని ఏడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. జార్జ్ రోడ్రిగ్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ జంట భూకంపాల్లో కనీసం 2,295 మంది మరణించగా, 11 వేల మందికి పైగా గాయపడ్డారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు పనులతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!