

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తన సంబంధాలను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. ఇరాన్ విషయంలో అమెరికాకు సహకరించేందుకు దక్షిణ కొరియా నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. దక్షిణ కొరియాలో సుమారు 39 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారని గుర్తుచేస్తూ, అలాంటప్పుడు ఇరాన్ విషయంలో సహాయం చేయకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు.
అంతేకాకుండా దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశించారు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన తనను గౌరవిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. కిమ్‌తో సంబంధాల ద్వారా కొరియా ద్వీపకల్పంలో పరిస్థితులను మరింత సురక్షితంగా మార్చగలమని ఆయన అన్నారు. ఇదే సమయంలో కిమ్ తన సంభాషణ ప్రతిపాదనకు స్పందించారని కూడా ట్రంప్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!