7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

Writer: Nithish 11:30 AM, 7 సెప్టెంబర్, 2026
సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. తొలిసారిగా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, నాయకత్వం అంటేనే తెలుగుదేశం అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అయితే నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే తనకు అత్యంత సంతృప్తి కలుగుతుందని చెప్పారు. సమర్థ నాయకత్వంతోనే సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయగలమన్నారు. వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తును అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి వ్యవస్థలను విధ్వంసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎన్నడూ లేని విజయాన్ని కూటమికి అందించారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నామని, స్వర్ణాంధ్ర విజన్-2047తో పాటు జిల్లాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక విజన్ ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేశామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, మత్స్యకారుల సంక్షేమం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 28 కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చామని అన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని తెలిపారు. అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పరిపాలనలో సాంకేతికతను వినియోగిస్తూ వాట్సాప్ ద్వారా 1,100 సేవలను అందుబాటులోకి తెచ్చామని, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భూములకు భద్రత కల్పిస్తున్నామని, 22ఏ భూముల సమస్యలతో పాటు దీర్ఘకాలంగా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

ట్యాగ్లు
చంద్రబాబులీడర్‌షిప్ కాన్‌క్లేవ్టీడీపీఆంధ్రప్రదేశ్అమరావతిపోలవరంస్వర్ణాంధ్ర విజన్ 2047ఉత్తరాంధ్రరాయలసీమసుపరిపాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!