
బిజినెస్

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) MyCall యాప్‌కు కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మొబైల్ వినియోగదారులు వాయిస్ కాల్ నాణ్యతను నేరుగా రేట్ చేయడంతో పాటు కాల్ డ్రాప్‌లు, వాయిస్ బ్రేక్‌లు, బలహీనమైన నెట్వర్క్, ఆడియో సమస్యలు వంటి అంశాలపై వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
వినియోగదారులు అందించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా టెలికాం కంపెనీల సేవలను TRAI పర్యవేక్షించి, నెట్వర్క్ పనితీరును మెరుగుపర్చే చర్యలు తీసుకోనుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా కాల్ నాణ్యత పెరగడంతో పాటు వినియోగదారుల సమస్యలు వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది.














కామెంట్స్ (1)
Very helpful