

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు (కల్లపరు) టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ యాజమాని నున్న సురేష్ (52) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం మేరకు, నున్న సురేష్ తన కుటుంబ సభ్యురాలు నున్న విమల దేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమల దేవికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!