

కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘సర్దార్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ‘సర్దార్’కు సీక్వెల్‌గా దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ‘సర్దార్ 2’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించిన చిత్రబృందం ఫస్ట్ సింగిల్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కార్తి చేతిలో మురుగన్ శూలం పట్టుకుని కనిపించగా, మరోవైపు నెమళ్లను చూపించారు. విభిన్నమైన ఈ పోస్టర్‌తో పాటపై ఆసక్తి మరింత పెరిగింది. ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!