

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కదలికలకు సంబంధించిన సంకేతాలు మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ అందాయి. దీంతో అటవీశాఖ అధికారులకు కొంత ఊరట లభించింది. పెద్దపులిని గుర్తించి సురక్షితంగా బంధించేందుకు చేపట్టిన ‘టైగర్ ఎక్స్ప్లోరర్’ ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. పులికి అమర్చిన ట్రాకర్ నుంచి తాజాగా సిగ్నల్స్ అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత అర్ధరాత్రి కనుమూరు అటవీ ప్రాంతంలోనే పులి సంచరించినట్లు గుర్తించారు. మూడు రోజులుగా ట్రాకర్ సంకేతాలు అందకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు.
తాజాగా సంకేతాలు అందడంతో పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అటవీ ప్రాంతంలో నిఘా కొనసాగిస్తున్నాయి. పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దానిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!