
సినిమాలు

విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో టికెట్ల విక్రయాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. వారం వ్యవధిలో రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కార్యనిర్వాహక అధికారి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు ప్రథమ సమాచార నివేదికలు నమోదు అయ్యాయి.
గతంలో నకిలీ రూ.500 టికెట్ల వ్యవహారంలో నిందితులపై స్వల్ప చర్యలు మాత్రమే తీసుకున్నారని విమర్శలు ఉన్నాయి. తాజా ఫిర్యాదు ఆధారంగా హోంగార్డు చంద్రశేఖర్‌ను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. నిన్న జరిగిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కార్యనిర్వాహక అధికారి చర్యలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!