

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారమైన అలన్ బోర్డర్ మెడల్‌ను వరుసగా రెండో ఏడాది గెలుచుకుని చరిత్ర సృష్టించారు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్‌కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీపై కేవలం ఒక్క ఓటు తేడాతో హెడ్ విజయం సాధించారు. మిచెల్ స్టార్క్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వరుసగా రెండుసార్లు అలన్ బోర్డర్ మెడల్ గెలిచిన రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్ సరసన హెడ్ చేరారు.
ఇటీవలి సీజన్లో అన్ని ఫార్మాట్లలో హెడ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. పెర్త్ టెస్టులో 123 పరుగులతో చెలరేగిన హెడ్.. సిరీస్‌లో మరో రెండు సెంచరీలతో సత్తా చాటారు. తనకు రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కడం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్న హెడ్.. భవిష్యత్తులో తన పిల్లలకు ఈ రెండు పతకాలను గర్వంగా చూపించుకోవడం ఆనందంగా ఉంటుందని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!