
సినిమాలు

సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కలకుంట కాలనీ వద్ద వాహనంలో ఆల్ఫ్రాజోలం తరలిస్తున్న ముగ్గురిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 39 కిలోల ఆల్ఫ్రాజోలం తో పాటు రూ.85.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. గత ఐదేళ్లుగా అక్రమంగా ఆల్ఫ్రాజోలం తయారుచేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితులను సిద్దిపేట మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా, కోర్టు రిమాండ్‌కు తరలించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!