
జనరల్

అమెరికా–ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న పురాతన విష్ణు దేవాలయం విశేషాలు చూపించారు. సుమారు 134 ఏళ్ల క్రితం భారతీయ వ్యాపారులు వాణిజ్య ప్రయోజనాల కోసం ఇరాన్‌కు వెళ్లి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుడు మహమ్మద్ అలీ తెలిపారు.
ఇండో-పర్షియన్ శైలిలో నిర్మితమైన ఈ దేవాలయంలో 72 చిన్న టవర్లు ఉండగా, వాటిలో హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ పూజా కార్యక్రమాలు జరగకపోయినా, ఈ ఆలయం భారత్–ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక మరియు సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!