

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళ్తున్న 116 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన అనంతరం, వృద్ధ భక్తురాలి వివరాలను గుర్తించి ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించారు. విజిలెన్స్ అధికారులు ఆమెను తమిళనాడులోని చెన్నైకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు.
టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ నుంచి ఆలయ దర్శనం వరకు టీటీడీ సిబ్బంది స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం నిర్వహించి, పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వృద్ధురాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోగా, ఆమె మనవడు దిక్పతి టీటీడీ చైర్మన్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!