

ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) అత్యాధునిక సీసీ కెమెరా నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టింది. “బస్సులో భరోసా” పేరుతో ప్రారంభించిన ఈ హైటెక్ ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా బస్సుల్లో దొంగతనాలు, అనుమానాస్పద కదలికలు మరియు అవాంఛనీయ ఘటనలను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్, మహిళల ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డ్ మరియు వెనుక భాగం వరకు ప్రతి కదలికను రికార్డు చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విజువల్స్‌ను ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థను అనుసంధానించారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో ఈ భద్రతా వ్యవస్థపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!