
బిజినెస్

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీసెట్-2026) నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే రూ.3,000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో సవరణలకు సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను telanganaset.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!