

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరిపారు. యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను మోదీ కోరారు. చర్చలు, దౌత్యం ద్వారానే శాశ్వత శాంతిని సాధించగలమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు భారత్ తన సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, నల్ల సముద్రం ప్రాంతంలోని ఘర్షణలపై కూడా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నావికుల భద్రతపై ఆందోళనను వెల్లడించారు. మరోవైపు 24వ ఇండో-రష్యా సమ్మిట్‌కు రష్యాకు రావాలని పుతిన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా 20 శాతం ఉందని మోదీ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్‌లో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, నౌకా నిర్మాణం, బయోటెక్నాలజీ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!