
సినిమాలు

వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ, వచ్చే మూడు రోజుల పాటు ఎండలు తీవ్రరూపం దాల్చనున్నట్లు హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పగటిపూట మాత్రమే కాకుండా వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని, వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి జాగ్రత్తపడాలని అధికారులు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!