
జనరల్

ఎడతెరిపి లేని వర్షాలతో చైనాలో భారీ వరదలు ముంచెత్తాయి. దేశవ్యాప్తంగా 62 నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం రాత్రి నుంచి 20 మంది మరణించగా, 331 మంది గాయపడ్డారు. వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించి సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది.
హెంగ్ఝౌలో ఒక ఫాం కూలిపోవడంతో దాదాపు 900 పాములు బయటకు వచ్చాయి. వరద నీటితో ఇళ్లలోకి ప్రవేశిస్తున్న ఈ పాముల వల్ల ప్రజల్లో తీవ్ర భయం నెలకొంది. ఎక్కువ శాతం పాములు విషపూరితం కానివేనని అధికారులు తెలిపారు. అయినప్పటికీ వాటిని చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!