

భారత్‌లో ఇంజినీరింగ్ చదివి అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదిగిన అనురాధ, వికాస్ సిన్హా దంపతులు తమ విద్యకు బాటలు వేసిన యూనివర్సిటీకి భారీ విరాళం అందించారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ (UNT)కు 20 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.191 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్‌పై ప్రత్యేక కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇద్దరూ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు.
ఈ విరాళం ద్వారా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకుల కోసం ఎండోమెంట్లు, ఎంట్రప్రెన్యూర్‌షిప్, పరిశోధనలు, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కార్యక్రమాలకు నిధులు అందనున్నాయి. వికాస్ సిన్హా ప్రస్తుతం బ్రాడ్‌కామ్‌లో మెయిన్‌ఫ్రేమ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. విద్య తమ జీవితాల్లో ఎన్నో అవకాశాలకు దారితీసిందని, అదే అవకాశాలను భవిష్యత్ తరాల విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు దంపతులు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!