
జనరల్

వరంగల్‌లో ప్రపంచస్థాయి విమానాశ్రయం ఏర్పాటు కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తై, భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించిందని తెలిపారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయ కలను సాకారం చేయలేకపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఈ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉపాధి, పెట్టుబడులకు కొత్త మార్గాన్ని తెరుస్తుందని అన్నారు. విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే దానిపై ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!