

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర భూములపై మూడో రోజు కూడా సర్వే కొనసాగింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజుపూర్ గ్రామాల పరిధిలోని భూములను డిజిటల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, సర్వే నంబర్ 325లోని భూముల్లో కొంత భాగం తమ గ్రామానికి చెందినదని వెంకటాపూర్ గ్రామస్థులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఖాస్రా, సేత్వార్ వంటి పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించి హద్దులను నిర్ధారించాలని వారు కోరుతున్నారు. మరోవైపు, సర్వే పూర్తైన తర్వాత క్షేత్రస్థాయి వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి తదుపరి చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. భూముల యాజమాన్యం, హద్దులపై తుది నిర్ధారణ అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం మాత్రమే స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!