
జనరల్

తెలంగాణ ప్రభుత్వం కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన సుమారు 1.05 కోట్ల మంది పేద లబ్ధిదారులకు ఈ కార్డులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదే రోజు తెలంగాణలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త తెల్ల రేషన్ కార్డు అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!