
జనరల్

తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఎండలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మండుతున్న ఎండలు, వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటిసారిగా రెడ్ అలర్ట్ జారీ చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!