
రాజకీయాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వచ్చే ఐదు రోజుల్లో సుమారు 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కర్నాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఉత్తర కోస్తాలో ఉరుములు మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉండగా, దక్షిణ కోస్తాలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!