
బిజినెస్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు తీవ్రంగా కొనసాగుతుండగా, మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!