

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI) అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించారు. 2026 సెప్టెంబర్ 29న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14434 ప్రకారం, చట్టపరంగా అనుమతించిన మేరకు ఫెడరల్ ప్రభుత్వ విభాగాలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రజా సమాచార ప్రకటనలు, వెబ్‌సైట్లు, నివేదికలు, విధాన పత్రాలు సహా ఇతర అధికారిక పత్రాల్లో కొత్త పదాన్ని ఉపయోగించాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాలు, భవిష్యత్తు అవకాశాలను ఈ పదం మెరుగ్గా ప్రతిబింబిస్తుందని వైట్‌హౌస్ పేర్కొంది.
అయితే, ఇప్పటికే జారీ చేసిన నిబంధనలు, అధ్యక్ష ఉత్తర్వులు, ఒప్పందాలు, గ్రాంట్లు, చారిత్రక పత్రాలను తిరిగి మార్చాల్సిన అవసరం లేదని ఆదేశంలో స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలు, మీడియా సంస్థలు కూడా ఈ పదాన్నే తప్పనిసరిగా ఉపయోగించాలనే నిబంధన ఇందులో లేదు. ప్రస్తుతం ‘సూపర్ ఇంటెలిజెన్స్’కు ఉన్న నిర్వచనం, అమెరికా చట్టాల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వచనాన్నే ఆధారంగా చేసుకుంది. దీనికి సంబంధించి 60 రోజుల్లోగా కొత్త సమాఖ్య నిర్వచనానికి అవసరమైన చట్టపరమైన ప్రతిపాదనలను సమర్పించాలని అధ్యక్షుడి సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారును ఆదేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!