
సినిమాలు

జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 31న నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్రం అనంతరం సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోషించిన చారిత్రక పాత్రను గవర్నర్ గుర్తుచేశారు. జాతీయ సమైక్యతను బలోపేతం చేసేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ, శాంతియుతమైన, బలమైన, ఐక్య దేశ నిర్మాణం కోసం ప్రజలందరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!