

ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను కాళోజీ తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ప్రజల భాషలోనే వారి సమస్యలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారని గుర్తుచేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.
తెలంగాణ భాష కేవలం మాట్లాడే విధానం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, జీవన విధానం, ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అన్నారు. భాష, యాసకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో కాళోజీ పాత్ర విశిష్టమైనదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుతూ భాష పట్ల గౌరవాన్ని మరింత పెంపొందించుకోవాలని, కాళోజీ ప్రజా చైతన్య స్ఫూర్తిని, ఆలోచనా విధానాన్ని నేటి తరానికి అందించాలని పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!