9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

Writer: Nithish 10:00 AM, 9 సెప్టెంబర్, 2026
అమెరికా-ఇరాన్‌ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు

అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్‌ గత రెండు రోజుల్లో రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్కామ్‌) తెలిపింది. అయితే ఈ రెండు దాడి ప్రయత్నాలను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుందని, అనంతరం ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌ దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు సెంట్కామ్‌ వెల్లడించింది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)కు చెందిన చమురు అక్రమ రవాణా వ్యవస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపించిన ఎంటీ కావిజ్‌, ఎంటీ చార్మినార్‌, ఎంటీ హారైజన్‌-1, ఎంటీ రియెస్కో నౌకలను గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో, ఎంటీ దర్యా నౌకను ఇరాన్‌లోని ఖార్గ్‌ ద్వీపం సమీపంలో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

దాడులకు ముందు నౌకల్లోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా బలగాలు ఆదేశించాయని, ఆ తర్వాత నౌకలను పనిచేయకుండా చేశాయని సెంట్కామ్‌ పేర్కొంది. ఇరాన్‌ నుంచి భారీ స్థాయిలో చమురు అక్రమ రవాణా చేస్తూ, ఐఆర్‌జీసీతో పాటు దాని ప్రాంతీయ మద్దతుదారులకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్‌ డాలర్ల ‘షాడో ఫ్లీట్‌’లో ఈ నౌకలు భాగమని అమెరికా ఆరోపించింది. సెప్టెంబర్‌ 5న కూడా మూడు ఇరాన్‌ చమురు నౌకలను అమెరికా ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, తాజా అమెరికా దాడుల్లో రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జాస్క్‌, ఖార్గ్‌ ద్వీపం సమీపంలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది. నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు తెలిపింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చరించినట్లు సమాచారం. ఇరాన్‌ అమెరికా నేవీ నౌకలపై దాడికి ప్రయత్నిస్తే ప్రతిసారీ మరిన్ని చమురు ట్యాంకర్లను కోల్పోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

నేషనల్ హైవే కు ఎన్ సీల్ తో మరమ్మతులు

నేషనల్ హైవే కు ఎన్ సీల్ తో మరమ్మతులు

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ భాష, యాస మన ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీకి హరీశ్‌రావు ఘన నివాళులు

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మహేష్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
అమెరికాఇరాన్అమెరికా నేవీసెంట్కామ్ఇరాన్ క్షిపణి దాడిచమురు నౌకలుఐఆర్‌జీసీఒమన్ గల్ఫ్ఖార్గ్ ద్వీపంపశ్చిమాసియా ఉద్రిక్తతలుమార్కో రూబియోఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..
జనరల్

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?
షోస్

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...
షోస్

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...
షోస్

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!