

ఈ ఏడాది దీపావళి బరిలో భారీ చిత్రాల మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపించే అవకాశం ఉంది. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి తదితరులు నటిస్తున్న ‘రామాయణ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీపావళి విడుదలను దృష్టిలో పెట్టుకుని ప్రచార కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి.
ఇదే సమయంలో నయనతార నటిస్తున్న ‘మహాశక్తి’ కూడా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘మూకుతి అమ్మన్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఇషారి కే గణేష్ నిర్మిస్తున్నారు. రెండు సినిమాలు విభిన్న నేపథ్యాలతో తెరకెక్కుతున్నప్పటికీ పండుగ సీజన్‌లో ఒకేసారి రావడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణ’, నయనతారకు ఉన్న క్రేజ్‌తో వస్తున్న ‘మహాశక్తి’ మధ్య పోటీ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!