

ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన కొత్త ప్రపంచ మ్యాప్‌పై వివాదం నెలకొంది. వివిధ దేశాల భూభాగాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చూపించేందుకు ‘కరెక్ట్ ద మ్యాప్’ పేరుతో చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ మ్యాప్ రూపొందించినట్లు పేర్కొనబడింది. ఈ తీర్మానానికి భారత్ సహా 164 దేశాలు మద్దతు ఇచ్చాయి.
అయితే కొత్త మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్, ఆక్సాయ్ చిన్‌లను ప్రత్యేక ప్రాంతాలుగా చూపించినట్లు సమాచారం. అరుణాచల్‌ప్రదేశ్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును దేశాల మధ్య సరిహద్దు తరహాలో చూపిస్తూ భారత్-చైనా మధ్య ప్రత్యేక ప్రాంతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆక్సాయ్ చిన్‌ను ఒకవైపు లడఖ్, మరోవైపు టిబెట్ మధ్య ప్రత్యేక ప్రాంతంగా చూపించారు. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు జమ్మూకశ్మీర్‌ను మ్యాప్‌లో చూపించిన విధానం కూడా చర్చనీయాంశమైంది. పీఓకేను వేరుచేస్తూ చుక్కల గీతను ఉపయోగించి, భారత్-పాక్ అంగీకరించిన నియంత్రణ రేఖను సూచించినట్లు మ్యాప్ కింద నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!