
జనరల్

కాళోజీ నారాయణరావు చెప్పిన “అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి” అనే మాటలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. అన్యాయాన్ని ఎదిరించి నిలబడేవారు, ప్రజల తరఫున గొంతెత్తి వారి హక్కుల కోసం పోరాడేవారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించేవారు తనకు నిజమైన ఆరాధ్యులని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలపై పోరాడుతూ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అన్యాయాన్ని ప్రశ్నించడం, ప్రజల హక్కుల కోసం పోరాడటం వంటి కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!