

‘టాక్సిక్’ ఫలితం తర్వాత సినిమా డిజిటల్ హక్కులపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఓటీటీ ఆఫర్ వచ్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఓటీటీ ఒప్పందం లేకుండానే ‘టాక్సిక్’ను థియేటర్లలో విడుదల చేసినట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందు సుమారు రూ.150 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి.
అయితే సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ ఆఫర్ విలువ ఇప్పుడు సుమారు రూ.30 కోట్లకు పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిర్మాణ సంస్థ కేవిఎన్‌కు గతంలో ‘జన నాయగన్’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. దళపతి విజయ్ నటించిన ఆ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియోతో రూ.100 కోట్లకు పైగా ఒప్పందం జరిగినప్పటికీ, పలు వాయిదాల కారణంగా ఆ సంస్థ వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అనంతరం సుమారు రూ.50 కోట్లకు జీ 5కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘టాక్సిక్’ వ్యవహారం కూడా ఇదే తరహాలో మారిందనే చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!