

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే ఊరమాస్ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య, కాజల్ మరోసారి జోడీగా కనిపించనున్నారు. శరత్‌కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారని, త్వరలో వారి ఫస్ట్ లుక్‌లను విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, అసలు డ్రామా సినిమాలో మరింతగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!