
జనరల్

దేశ చరిత్రలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోదీ గారికి తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఘనత ప్రజలు ఆయన నాయకత్వంపై ఉంచిన అపార విశ్వాసానికి నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠ పెంపు వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఆయన అన్నారు.
“వికసిత్ భారత్–2047” లక్ష్య సాధన దిశగా చేపడుతున్న కార్యక్రమాలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!