
రాజకీయాలు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేడు సచివాలయంలో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, పీఆర్సీ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నాయి.
ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీపై పురోగతితో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంపై కూడా ప్రతినిధులు చర్చించనున్నారు. గతంలో జరగాల్సిన సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 21కి వాయిదా పడింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!