
జనరల్

ఒక గణిత ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ప్రత్యేక హామీ ఇచ్చారు. ఎస్ఎస్సీ పరీక్షల్లో 550కు పైగా మార్కులు సాధిస్తే విమాన ప్రయాణం బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఆ ప్రోత్సాహాన్ని సవాలుగా తీసుకున్న విద్యార్థి శ్రీమంతుల కష్టపడి చదివి 600 మార్కులకు గాను 554 మార్కులు సాధించి గురువు మాటను నిజం చేశాడు.
విద్యార్థి విజయాన్ని అభినందిస్తూ ఆ ఉపాధ్యాయుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విమాన ప్రయాణాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటోంది. మంచి గురువులు కేవలం పాఠాలు మాత్రమే కాదు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి పెద్ద కలలు కనాలని ప్రేరణ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!