
క్రీడలు

తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తనకు హెడ్‌కౌంట్ కాదు, నెంబర్ ముఖ్యం” అని పేర్కొన్న ఆయన, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించిన పార్టీ లేదా కూటమిని బలనిరూపణకు ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
గవర్నర్ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే), భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు అసహనం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) – ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) మధ్య పొత్తుపై ఊహాగానాలు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!