

హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన బలరాం మొహంతా (28) గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్న అతడు.. అదే ముసుగులో గంజాయి దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 1,089 గ్రాముల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ డెలివరీ పనుల పేరుతో గంజాయి సరఫరా, విక్రయాలు సాగిస్తున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా సంబంధం కలిగి ఉన్నారా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల తదుపరి విచారణలో వెల్లడికానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!