

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను తాజాగా ఎత్తివేసింది. వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంతి రాణా టాటాను ఈ నెల 4వ తేదీ నుంచి, విశాల్ గున్నిని సెప్టెంబరు 5వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ముంబయికి చెందిన నటి కాదంబరీ జెత్వానీకి సంబంధించిన కేసు వ్యవహారంలో ఈ అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీసులు కాదంబరీ జెత్వానీపై ఓ ఫోర్జరీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌తో కలిసి కుట్రకు పాల్పడి, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి జెత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి వేధించారని ఆరోపించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ కేసులో సస్పెండ్ అయిన పి. సీతారామాంజనేయులు ఆగస్టులో పదవీ విరమణ చేశారు. తాజాగా కాంతి రాణా టాటా, విశాల్ గున్నిల సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!