

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించేందుకు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసన ముందు అడ్వకేట్ నరేంద్ర మిశ్రా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తక్షణ విచారణ కోరారు. విద్యార్థులు నీట్ ప్రశ్నాపత్ర లీక్‌కు వ్యతిరేకంగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు కోరుతూ నిరసన చేపట్టారని, ఈ సందర్భంగా పోలీసులు అధిక బలప్రయోగం చేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయవాది చెప్పినా, కోర్టు వాటిని పరిశీలించేందుకు సమయం లేదని స్పష్టం చేస్తూ విచారణను తిరస్కరించింది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టు కూడా తక్షణ విచారణకు నిరాకరించి, ఇలాంటి విషయాల్లో కోర్టును లాగవద్దని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు త్వరలో విచారణ జరపవచ్చని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!